Andhrapradesh: కానిస్టేబుల్‌ అభ్యర్థులకు అలర్ట్‌

కానిస్టేబుల్‌ అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ నియామక మండలి శుభవార్త చెప్పింది. 6,100 పోస్టులకు సంబంధించి నియామక ప్రక్రియను డిసెంబర్‌ చివరి వారంలో మొదలు పెడతామని ప్రకటించింది.

By అంజి  Published on  7 Nov 2024 6:59 AM IST
Andhra Pradesh, Constable Candidates, APnews, Police Recruitment Board

Andhrapradesh: కానిస్టేబుల్‌ అభ్యర్థులకు అలర్ట్‌

కానిస్టేబుల్‌ అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ నియామక మండలి శుభవార్త చెప్పింది. 6,100 పోస్టులకు సంబంధించి నియామక ప్రక్రియను డిసెంబర్‌ చివరి వారంలో మొదలు పెడతామని ప్రకటించింది. గతేడాది ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా.. వివిధ కారణాలతో ఫిజికల్‌ టెస్ట్‌లు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం ఫిజికల్‌ టెస్టుల నిర్వహణ కోసం కీలక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రిలిమినరీలో అర్హత సాధించిన వారికి ఫిజికల్‌ టెస్టులు నిర్వహించనున్నట్టు తెలిపింది.

మొత్తం 4,59,182 మంది పరీక్షకు హాజరుకాగా 95,208 మంది అర్హత సాధించారు. ఫిజికల్‌ టెస్టుల కోసం 91,507 మంది దరఖాస్తు చేసుకోగా.. దరఖాస్తు చేసుకోని వారు ఈ నెల 11వ తేదీ నుంచి 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరక దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఈ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ 2022లో రిలీజ్‌ చేయగా.. 2023 జనవరిలో ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించారు.

Next Story