పీసీసీ డెలిగేట్‌గా చిరంజీవి

AICC has Issued A New ID Card to Chiranjeevi. మెగాస్టార్ చిరంజీవి రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్న విష‌యం తెలిసిందే.

By Medi Samrat  Published on  21 Sept 2022 7:19 PM IST
పీసీసీ డెలిగేట్‌గా చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్న విష‌యం తెలిసిందే. కాంగ్రెస్‌లో ఉన్న‌ ఆయనను డెలిగేట్‌ గా గుర్తిస్తూ కొత్త ఐడీ కార్డును ఏఐసీసీ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ తరుపున ఈ కొత్త ఐడెంటిఫికేషన్ కార్డును ఏఐసీసీ జారీ చేసింది. 2027వ సంవత్సరం వరకూ కాంగ్రెస్ డెలిగేట్‌ గుర్తిస్తూ ఏఐసీసీ ఈ కార్డును విడుదల చేసింది. కొవ్వూరు నుంచి చిరంజీవిని పీసీసీ డెలిగేేట్ గా ఎంపిక చేశారు. ఇదిలావుంటే.. నిన్ననే గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్ లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి ఒక ఆడియోను విడుదల చేశారు. నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను. కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు అన్న ట్వీట్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఆడియో వైరల్ అయిన మరుసటి రోజే కాంగ్రెస్ ఐడీ కార్డు విడుదల చేయడంతో.. చిరంజీవి ఏ విధంగా స్పందిస్తారోన‌ని స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.

Next Story