ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు పరిసర ప్రాంతాల్లో అఘోరీ జనజీవనానికి ఆటంకం కలిగించే రీతిలో పనులు చేస్తూ ఉండడంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అఘోరీ మంగళగిరిలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలిసేదాకా కదలనంటూ జాతీయ రహదారిపై బైఠాయించింది. దాంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఆమెను అక్కడ్నించి తరలించేందుకు పోలీసులు యత్నించగా, ఆమె వారిపైనా దాడి చేసింది. పోలీసులు డీసీఎం వ్యాన్ ను తీసుకొచ్చి వ్యాన్ లోకి ఎక్కించారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో అఘోరీ కనిపించారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ను కలిసేందకు గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉన్న జనసేన కార్యాలయం దగ్గర చేరుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేరని చెప్పినా కూడా అఘోరీ మాట వినలేదు. ఓ పోలీసు అధికారిపై చేయి చేసుకున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.