విశాఖలో అఘోరాల వీరంగం.. వచ్చిపోయే వాహనాలను ఆపుతూ

Aghora hulchul in in visakha district. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాలో అఘోరాలు పెద్ద వీరంగం చేశారు. నర్సీపట్నంలోరి రోడ్డుపై తిరుగుతూ

By అంజి  Published on  11 Feb 2022 10:50 AM IST
విశాఖలో అఘోరాల వీరంగం.. వచ్చిపోయే వాహనాలను ఆపుతూ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాలో అఘోరాలు పెద్ద వీరంగం చేశారు. నర్సీపట్నంలోరి రోడ్డుపై తిరుగుతూ బీభత్సం సృష్టించారు. రోడ్లపై నిల్చుని వచ్చి పోయే వాహనాలను ఆపుతూ వాహనదారులను భయభ్రాంతులకు గురి చేశారు. గంజాయి సేవించిన అఘోరాలు కృష్ణ బజార్‌ సెంటర్‌లో.. ఇటీవల బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమా చూసేందుకు వచ్చి హల్‌చల్‌ చేశారు. బట్టల్లేకుండా రోడ్లపై అటు, ఇటు తిరుగుతూ.. వాహనాలపు ఆపుతూ వీరంగం చేశారు. వాహనాలకు అడ్డుగా వెళ్లి, వాహనదారులను డబ్బులివ్వాలని డిమాండ్‌ చేస్తూ భయాందోళన కలిగించారు.

అఘోరాల వీరంగంతో ఆ ప్రాంతమంతా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ఆ ప్రాంతం రద్దీగా మారింది. అదే సమయంలో ఫస్ట్‌ షో సినిమా చూసి అటుగా వెళ్తున్న స్థానికులు అఘోరాలను చూసి భయభ్రాంతులకు లోనయ్యారు. వేరే దారి గుండా తమ తమ ఇళ్లకు చేరుకున్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో.. అఘోరాలు అక్కడి నుండి పరారయ్యారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.



Next Story