ఇంటర్ ఫలితాలపై త్వరలోనే నిర్ణయం

Adimulapu Suresh About 10th Results. ఏపీలో టెన్త్, ఇంటర్ ఫలితాలపై ఏపీ విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. ఫలితాలపై నివేదిక రెడీ చేసింది

By Medi Samrat  Published on  21 July 2021 10:13 AM GMT
ఇంటర్ ఫలితాలపై త్వరలోనే నిర్ణయం

ఏపీలో టెన్త్, ఇంటర్ ఫలితాలపై ఏపీ విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. ఫలితాలపై నివేదిక రెడీ చేసింది. గ్రేడ్ల విధానంతో మార్కులు విడుదల చేయాలని నిర్ణయించింనట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. ఈ మేర‌కు ఇంటర్ పరీక్షల ఫలితాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఫలితాల ప్రకటనపై ఇప్పటికే సీఎం జగన్‌కు ప్రతిపాదనలు పంపామని, త్వరలో నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. టెన్త్ పరీక్షల ఫలితాలు ప్రకటించేందుకు చర్యలు చేపట్టామని మంత్రి సురేష్ తెలిపారు. కరోనా కారణంగా ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు ఇప్పటికే రద్దయ్యాయి. ఫలితాల ప్రకటనపై విద్యార్థులంతా ఎదురుచూస్తున్నారు.
Next Story
Share it