పవన్‌కల్యాణ్‌కు అంతర్జాతీయ గుర్తింపు..తొలి తెలుగు వ్యక్తిగా రికార్డు

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ అంతర్జాతీయంగా అరుదైన గుర్తింపు పొందారు.

By -  Knakam Karthik
Published on : 11 Jan 2026 6:09 PM IST

Andrapradesh, Pawan Kalyan, Ap Deputy Cm, Martial Arts, International Recognition

పవన్‌కల్యాణ్‌కు అంతర్జాతీయ గుర్తింపు..తొలి తెలుగు వ్యక్తిగా రికార్డు

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ అంతర్జాతీయంగా అరుదైన గుర్తింపు పొందారు. ప్రాచీన జపాన్ కత్తి యుద్ధకళ అయిన కెన్జుట్సులో ఆయనకు అధికారిక ప్రవేశం లభించింది. మార్షల్ ఆర్ట్స్ లో ఆయనకు మూడు దశాబ్దాలకుపైగా ఉన్న అనుభవం, ఇందులో చేసిన పరిశోధనలు, నిబద్ధతకు ఇది అద్దం పట్టింది. కెనిన్ కై ఇంటర్నేషనల్ స్వోర్డ్ ఇన్ స్టిట్యూషన్ ఆయన ఈ గుర్తింపును ప్రదానం చేసింది.

అంతేకాకుండా జపాన్ వెలుపల 'సోకే మురమత్సు సెన్సై' ఆధ్వర్యంలోని 'టకెడా షింగెన్ క్లాన్'లో ప్రవేశం పొందిన తొలి తెలుగు వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు. జపాన్ వెలుపల ఈ స్థాయి గౌరవం లభించడం అత్యంత అరుదైన విషయం కావడం విశేషం. ఇదే క్రమంలో గోల్డెన్ డ్రాగన్స్ సంస్థ ద్వారా పవన్ కళ్యాణ్‌కు తాజాగా 'టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్" అనే విశిష్ట బిరుదు కూడా లభించింది. తన అధునాతన శిక్షణలో భాగంగా, భారతదేశంలో జపాన్ యుద్ధకళలలో అగ్రగణ్యులలో ఒకరైన ప్రముఖ బుడో నిపుణుడు హాన్షి ప్రొఫెసర్ డాక్టర్ సిద్ధిక్ మహ్మూదీ వద్ద పవన్ కళ్యాణ్ శిక్షణ పొందారు.

మూడు దశాబ్దాలకు పైగా ఆయన క్రమశిక్షణతో సాగించిన సాధన, పరిశోధన, మార్షల్ ఆర్ట్స్ పట్ల ఉన్న అంకితభావానికి నిదర్శనంగా ఈ గుర్తింపు లభించినట్టు భావిస్తున్నారు. ముఖ్యంగా ఆయన సినిమాలు, రాజకీయాల్లోకి అడుగుపెట్టకముందే మార్షల్ ఆర్ట్స్ ప్రయాణాన్ని ప్రారంభించటం విశేషం. ఈ రంగంలో ఆయన చూపిన దీర్ఘకాలిక నిబద్ధతను గుర్తించిన అంతర్జాతీయ సంస్థలు ఇప్పటికే పవన్ కళ్యాణ్‌కు పలు ప్రతిష్ఠాత్మక గౌరవాలను అందించాయి. జపాన్ సంప్రదాయ యుద్ధకళల్లో అత్యంత గౌరవనీయమైన సంస్థలలో ఒకటైన 'సోగో బుడో కన్‌రి కై' నుంచి పవన్ కళ్యాణ్‌కు ఫిఫ్త్ డాన్ (ఐదవ డాన్) పురస్కారం లభించింది.

Next Story