మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాకుండా దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మృతి చెందిన సమయంలో జగన్ ప్రవర్తనపై ఆయన పలు అనుమానాలను వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడు, జగన్ వైఖరిని తప్పుబట్టారు. వైఎస్ఆర్ చనిపోయిన రోజు జగన్ ఎక్కడ ఉన్నారో చెప్పాలన్నారు. రాష్ట్రమంతా తన తండ్రి కనిపించడం లేదని ఆందోళన చెందుతుంటే, జగన్ ఇతర రాష్ట్రాల్లో ఉండాల్సిన అవసరం ఏమొచ్చిందని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. వైఎస్ఆర్ మృతి వెనుక జగన్ హస్తం ఉందనే అనుమానాన్ని గతంలో బొత్స సత్యనారాయణే వ్యక్తం చేశారని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు.