ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నిందితులు

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

By -  Knakam Karthik
Published on : 9 March 2026 2:31 PM IST

Andrapradesh, AP liquor scam case,  Enforcement Directorate

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నిందితులు

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో భాగంగా (ఈడీ) సోమవారం పలువురు నిందితులను విచారణకు పిలిపించింది. విచారణకు ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, చాణక్య, వెంకటేష్ నాయుడు హాజరయ్యారు.

ఇందులో ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్‌రెడ్డిని ఈడీ అధికారులు సుమారు గంటన్నర పాటు ప్రశ్నించినట్లు సమాచారం. కేసుకు సంబంధించి బ్యాంక్ లావాదేవీలు, పాన్ కార్డ్ వివరాలు, కుటుంబ సభ్యుల ఆస్తులకు సంబంధించిన పత్రాలను ఆయన ఈడీ అధికారులకు సమర్పించినట్లు తెలిసింది.

విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన కృష్ణమోహన్ రెడ్డి, ఈడీ దర్యాప్తుకు తాను పూర్తిగా సహకరిస్తున్నానని తెలిపారు. అధికారులు కోరిన అన్ని డాక్యుమెంట్లను అందజేశానని, అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చానని చెప్పారు.

అలాగే అవసరమైనప్పుడు మళ్లీ విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు ఆదేశించినట్లు సమాచారం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఆర్థిక లావాదేవీలు, సంబంధిత వ్యక్తుల పాత్రలపై ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది.

Next Story