30,000 రూపాయల లంచం డిమాండ్.. అడ్డంగా దొరికిపోయిన అధికారి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో డి.శాంతన్ కుమార్ అనే వ్యవసాయ అధికారి ₹30,000 లంచం డిమాండ్ చేసి అడ్డంగా దొరికిపోయాడు.

By Medi Samrat  Published on  20 Feb 2025 6:37 PM IST
30,000 రూపాయల లంచం డిమాండ్.. అడ్డంగా దొరికిపోయిన అధికారి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో డి.శాంతన్ కుమార్ అనే వ్యవసాయ అధికారి ₹30,000 లంచం డిమాండ్ చేసి అడ్డంగా దొరికిపోయాడు. తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్ హ్యాండెడ్ గా అతడిని పట్టుకున్నారు.

ఫిర్యాదుదారుడు తన భూమిలో సాగు చేసిన పత్తిని విక్రయించడానికి వీలు కల్పించే కూపన్‌లను జారీ చేయాలని కోరాడు. దీనికి బదులుగా నిందితుడు ఫిర్యాదుదారుడి నుండి లంచం అడిగాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ బృందం గాలింపు చర్యలు చేపట్టి సంబంధిత అధికారిని అరెస్టు చేసింది.

Next Story