ఏసీ ఆన్ చేసుకుని పడుకున్నారు.. ఊహించని ప్రమాదం..!

AC Exploded due to high voltage woman died son ill. ఎప్పటిలాగే ఏసీ ఆన్ చేసి నిద్రపోయిన మహిళ నిద్రలోనే అస్వస్థతకు గురైంది.

By M.S.R  Published on  31 May 2023 10:37 AM GMT
ఏసీ ఆన్ చేసుకుని పడుకున్నారు.. ఊహించని ప్రమాదం..!

ఎప్పటిలాగే ఏసీ ఆన్ చేసి నిద్రపోయిన మహిళ నిద్రలోనే అస్వస్థతకు గురైంది. ఏసీలో నుంచి విష వాయువులు పీల్చడం వల్ల ఆమె, అక్కడే నిద్రపోతున్న కుమారుడు కూడా అస్వస్థతకు గురయ్యారు. వారిద్దరినీ స్థానికులు గమనించి, హాస్పిటల్ కు తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో ఆ మహిళ మరణించింది. ఈ ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.

చీమకుర్తి ప్రాంతంలో 52 ఏళ్ల దామర్ల శ్రీదేవి అనే మహిళ తన కుమారుడు సాయితేజతో కలిసి ఓ ఇంట్లో నివసిస్తున్నారు. ఆమె ఒంగోలు జిల్లా పరిషత్ ఆఫీసులో పీఎఫ్ సెక్షన్ లో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు. ఆమె భర్త వెంకట సుబ్బారెడ్డి టీచర్ గా పని చేస్తున్న సమయంలో చనిపోవడంతో కారుణ్య నియామకం కింద ప్రభుత్వం ఆ ఉద్యోగం ఇచ్చింది. చీమకుర్తి పట్టణంలోని పల్లపోతు వారి వీధిలో ఆమె ఉంటున్నారు. ఈ నెల 28వ తేదీన రాత్రి శ్రీదేవి, ఆమె కుమారుడు సాయితేజ ఇంట్లో నిద్రపోయారు. వారి ఇంట్లో హైవోల్టేజీ కరెంట్ సరఫరా కావడంతో వైర్లు కాలిపోయాయి. దీంతో ఏసీలో నుండి గ్యాస్ లీక్ అయింది. నిద్రలో ఉన్న తల్లి కుమారులు ఈ విషయాన్ని గమనించలేదు. ఆ ఇంట్లో నుంచి పొగలు రావడాన్ని స్థానికులు గుర్తించారు.. వెంటనే ఆ ఇంటికి చేరుకున్నారు. తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు. విష వాయువులు పీల్చడం వలన అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అస్వస్థతకు గురైన తల్లీ కుమారులను హాస్పిటల్ కు తీసుకెళ్లారు. వారిద్దరూ ఒంగోలు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఉండగా.. శ్రీదేవి పరిస్థితి విషమించింది. ఆమె మంగళవారం రాత్రి చనిపోయారు. కుమారుడు సాయితేజ ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.


Next Story