రేపు ఏపీ గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేయనున్న అబ్దుల్‌ నజీర్

ఆంధ్రప్రదేశ్‌ నూతన గవర్నర్‌గా సుప్రీంకోర్టు మాజీ జడ్జీ అబ్దుల్‌ నజీర్‌ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

By అంజి  Published on  23 Feb 2023 3:45 PM IST
Abdul Nazir,  Andhra Pradesh, New Governor, CM YS Jagan

రేపు ఏపీ గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేయనున్న అబ్దుల్‌ నజీర్

ఆంధ్రప్రదేశ్‌: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన సతీమణితో కలిసి గురువారం రాజ్‌భవన్‌లో నూతన గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ దంపతులను మర్యాదపూర్వకంగా కలిశారు. రేపు (శుక్రవారం) ఏపీ గవర్నర్‌గా రిటైర్డ్‌ జడ్జీ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకు సంబంధించి రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. కాగా, కొత్త గవర్నర్‌గా నియమితులైన జస్టిస్‌ ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌కు సీఎం జగన్‌ ఘనస్వాగతం పలికారు.

జస్టిస్ అబ్దుల్ నజీర్, ఆయన కుటుంబ సభ్యులు బుధవారం రాత్రి 8.15 గంటలకు ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. వారికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు, ఛత్తీస్‌గఢ్‌కు బదిలీ అయిన ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ బుధవారం ఉదయం రిలీవ్ అయ్యారు. గవర్నర్ల విభజనలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అబ్దుల్ నజీర్‌ను గవర్నర్‌గా నియమించారు.


Next Story