గుడ్ న్యూస్..ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ పెన్షన్ల పంపిణీ, ఆ జిల్లాలో సీఎం టూర్

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నేడు చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు.

By Knakam Karthik  Published on  1 March 2025 7:49 AM IST
Andrapradesh, Pension Distribution, CM Chandrababu, Chittor

గుడ్ న్యూస్..ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ పెన్షన్ల పంపిణీ, ఆ జిల్లాలో సీఎం టూర్

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నేడు చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో జీడీ నెల్లూరులోని రామానాయుడు పల్లెకు చేరుకోనున్నారు. గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు లబ్ధిదారులకు సీఎం అందివ్వనున్నారు. అలాగే, పది సూత్రాలు భాగంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలించనున్నారు. ఇక, ప్రజా వేదిక సభ నుంచి స్థానిక ప్రజల్ని ఉద్దేశించి సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు. రామానాయుడు పల్లెలో స్థానిక టీడీపీ నేతలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 3.55 గంటలకు తిరుపతి ఎయిర్ పోర్ట్ నుంచి విజయవాడకి తిరుగు పయనం కానున్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల మొదటి రోజు పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేస్తున్న నేపథ్యంలో నేడు పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. వృద్ధులకు, వితంతువులకు నాలుగు వేల రూపాయలు, దివ్యాంగులకు ఆరువేల రూపాయల చొప్పున పింఛన్ల పంపిణీ చేయనున్నారు.

Next Story