అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు డిగ్రీ కాలేజీలో 20 వేల మందికి పైగా విద్యార్థులు 108 సూర్య నమస్కారాలు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. 'యోగా - మహా సూర్య వందనం' కార్యక్రమంలో భాగంగా దాదాపు 50 పాఠశాలలకు చెందిన 20 వేల మంది గిరిజన విద్యార్థులు 108 సూర్య నమస్కారాలు చేశారు. దాదాపు రెండు గంటల పాటు 108 సూర్య నమస్కారాలు చేయడంతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నమోదైంది. ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేడుకల్లో భాగంగా జరిగిన ఈ కార్యక్రమాన్ని లండన్ వరల్డ్ రికార్డ్స్ యూనియన్ మేనేజర్ ఆలిస్ రెనాడ్ అధికారికంగా గుర్తించారు, ఆమె సర్టిఫికెట్‌ను జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్‌కు అందజేశారు.
కాగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. సూర్య నమస్కారాల ప్రదర్శననను చూడటానికి నేను రాత్రి నుంచి ఇక్కడే ఉన్నారు.. ఇది కొత్త ప్రపంచ రికార్డు, ఈ సందర్భంగా విద్యార్థులను అభినందిస్తున్నా. ఈ ప్రపంచ రికార్డు నెలకొల్పేందుకు దాదాపు ఐదు నెలలుగా విద్యార్థులు సాధన చేశారు. జిల్లాలోని ఐదు మండలాల విద్యార్థులు యోగా సాధనలో పాల్గొన్నారని మంత్రి సంధ్యారాణి చెప్పారు.