అమరావతి: నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 0 - 6 ఏళ్లు గల చిన్నారుల కోసం ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నారు. ఈ నెల 21 నుంచి 24, ఈ నెల 27 నుంచి 30 వరకు ఆధార్ నమోదు చేయనున్నట్టు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 11,06,264 మంది చిన్నారుల్లో 9,80,575 మంది నేటికీ ఆధార్ నమోదు చేసుకోలేదని గణాంకాలు చెబుతున్నాయి.
ఆధార్ నమోదు కార్యక్రమంను విజయవంతం చేయాలని ఆ శాఖ డైరెక్టర్ శివ ప్రసాద్ కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. తప్పనిసరిగా చిన్నారులకు ఆధార్ నమోదయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఐదేళ్లలోపు పిల్లలకు ఎటువంటి బయోమెట్రిక్ లేకుండా ఫొటో, పేరు, అడ్రస్, తల్లిదండ్రుల పేరు వంటి ప్రాథమిక సమాచారంతోనే ఆధార్ కార్డులు జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.