బాయ్ ఫ్రెండ్ తన నంబర్ బ్లాక్ చేశాడని ఓ యువతి 100కు కాల్ చేసింది. ఇది విని పోలీసులు షాకయ్యారు. ఈ ఘటన ఏపీలోని అనంతపురం జిల్లా గుత్తిలో జరిగింది. 'అతను నాతో మాట్లాడట్లేదు. నంబర్ బ్లాక్ చేశాడు. మీరు వాడితో మాట్లాడి నా నంబర్ అన్‌బ్లాక్ చేయించండి' అని 100కు ఫోన్ చేసి చెప్పింది. ఈ విషయంలో యువతి ఏదైనా తీవ్ర నిర్ణయం తీసుకుంటుందేమోనని భావించి గుత్తి పోలీస్ స్టేషన్ బ్లూకోల్ట్ పోలీసులు ఆమెను సంప్రదించారు.
ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే కావడంతో డయల్ 100 ద్వారా గురువారం వచ్చిన ఈ ఫిర్యాదును కంట్రోల్ రూం నుంచి లోకల్ పోలీస్‌స్టేషన్‌కు పంపించారు. ఈ క్రమంలోనే పోలీసులు ఆ యువతిని ఫోన్ ద్వారా సంప్రదించారు. అయితే తన ఇంటికి పోలీసులు రావొద్దని, తన బాయ్‌ఫ్రెండ్ ఫోన్‌లో తన నంబర్ అన్‌బ్లాక్ చేయిస్తే చాలని యువతి చెప్పింది. ఈ క్రమంలోనే కానిస్టేబుల్ యువతి బాయ్ ఫ్రెండ్ నెంబర్ తీసుకుని ఫోన్ చేశాడు. కానీ యువకుడు కాల్ లిఫ్ట్ చేయలేదు. దీంతో పోలీసులు పీఎస్‌కు వచ్చి కంప్లైంట్ చేయాలని యువతికి సూచించారు.