అర్ధరాత్రి బాలిక ఇంటికి వెళ్లిన యువకుడు.. బలవంతంగా తాళి కట్టించిన బంధువులు

ప్రేమ పేరుతో అర్ధరాత్రి బాలిక ఇంటికెళ్లాడో యువకుడు. ఇది గమనించిన చుట్టు పక్కల వారు యువకుడిని బంధించి బలవంతంగా యువకుడితో బాలికకు తాళి కట్టించారు.

By అంజి  Published on  7 Oct 2024 7:10 AM IST
young man, girl house, love, Krishna district, APnews

అర్ధరాత్రి బాలిక ఇంటికి వెళ్లిన యువకుడు.. బలవంతంగా తాళి కట్టించిన బంధువులు

ప్రేమ పేరుతో అర్ధరాత్రి బాలిక ఇంటికెళ్లాడో యువకుడు. ఇది గమనించిన చుట్టు పక్కల వారు యువకుడిని బంధించి బలవంతంగా యువకుడితో బాలికకు తాళి కట్టించారు. కృష్ణా జిల్లా గన్నవరం మండల పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సూరంపల్లి గ్రామానికి చెందిన గుర్రం శ్రీకాంత్ అనే యువకుడు కొంతకాలంగా ప్రేమ పేరుతో బాలిక ఇంటికి తరచూ వచ్చేవాడు. అతడి రాకపోకలకు చుట్టుపక్కల వారు గమనిస్తూ వచ్చారు.

శనివారం నాడు రాత్రి బాలిక ఇంటికి వెళ్లిన యువకుడిని బాలిక బంధువులు అదుపులోకి తీసుకుని తాళ్లతో కట్టివేశారు. ఆ తర్వాత బాలికను పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టారు. వేరు వేరు కులాలు కావడంతో పెళ్లికి యువకుడి పేరెంట్స్‌ నిరాకరించారు. అయితే పెద్దల సమక్షంలో యువకుడితో బాలికకు తాళి కట్టించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఇరు వర్గాలను పోలీస్‌స్టేషన్‌కు రప్పించి కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం ఐసీడీఎస్ ఉజ్వల హోమ్ ప్రతినిధులు సీఐ శివప్రసాద్‌ నుండి పూర్తి వివరాలు సేకరించారు. బాలికను హోమ్‌కు తరలించారు.

Next Story