గత ప్రభుత్వ దోపిడీపై సమగ్ర విచారణ జరిపిస్తా: మంత్రి నారా లోకేష్‌

విశాఖపట్నంలో రూ. 500 కోట్లతో హిల్ ప్యాలెస్ నిర్మాణంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు.

By అంజి  Published on  20 Jun 2024 8:45 AM GMT
YCP government, Minister Nara Lokesh, APnews, rushikonda palace, vizag

గత ప్రభుత్వ దోపిడీపై సమగ్ర విచారణ జరిపిస్తా: మంత్రి నారా లోకేష్‌

విశాఖపట్నంలో రూ. 500 కోట్లతో హిల్ ప్యాలెస్ నిర్మాణంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి, తెలుగుదేశం పార్టీ (టిడిపి) నాయకుడు నారా లోకేష్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. రుషికొండ ప్యాలెస్ నిర్మాణం పెద్ద వివాదానికి దారితీసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపడుతుందని లోకేష్ చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న తరుణంలో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ విశాఖపట్నంలో రుషికొండ ప్యాలెస్‌ను పెద్ద పెద్ద బారికేడ్ల వెనుక రహస్యంగా నిర్మించారని టీడీపీ ఆరోపించింది.

పేదలు తమ పిల్లలు భవిష్యత్తు కోసం కష్టపడుతుంటే జగన్ వారి డబ్బుతో ఒక రాజభవనం నిర్మించుకున్నారంటూ మంత్రి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. వైఎస్‌ జగన్‌ దోపిడీలు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయ్నారు. గత ప్రభుత్వం ఎంత దొపిడీకి పాల్పడిందో.. జాతీయ కథనాలు చూస్తుంటే తెలుస్తోందని, త్వరలోనే దీనిపై విచారణ జరిపి, న్యాయం జరిగేలా చూస్తామని నారా లోకేష్‌ అన్నారు. ఈ భవనం ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు అంకితం చేస్తామని నారా లోకేష్ అన్నారు. రుషికొండ ప్యాలెస్‌లో కనిపించే ఐశ్వర్యం, విలాసవంతమైన ఖర్చులు వివాదాన్ని రేకెత్తించాయి. ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి భయంకరంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రూ. 12 లక్షల కోట్ల అప్పులో ఉంది.

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీని గద్దె దించి అధికారంలోకి వచ్చిన టీడీపీ, రుషికొండ ప్యాలెస్ నిర్మాణ సమయంలో వివిధ సౌకర్యాల కోసం దుబారా ఖర్చు పెట్టడాన్ని ఎత్తిచూపింది. రుషికొండ ప్యాలెస్‌లో విలాసాలు, సౌకర్యాలు ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఈ విలాసాలపై దాదాపు రూ. 500 కోట్ల పెట్టుబడులు వచ్చాయని పేర్కొంటూ వివిధ సౌకర్యాల కోసం చేస్తున్న దుబారా ఖర్చులను ఎత్తిచూపారు.

"అదనంగా, ప్యాలెస్‌లో విలాసవంతమైన ఫర్నిచర్, హై-ఎండ్ మసాజ్ టేబుల్‌తో కూడిన స్పా రూమ్ కూడా ఉన్నాయి" అని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ కొమ్మారెడ్డి చెప్పారు. ఈ నిర్మాణాల కాంట్రాక్టును జగన్ మోహన్ రెడ్డి బంధువు డీవీరెడ్డి శ్రీనాథ్ రెడ్డికి కట్టబెట్టారని ఆరోపిస్తూ పరస్పర విరుద్ధ ప్రయోజనాలను కూడా ఎత్తిచూపారు. ఈ ఆరోపణలపై వైఎస్‌ఆర్‌సిపి అధికార ప్రతినిధి కనుమూరి రవిచంద్రారెడ్డి స్పందిస్తూ.. కొండ ప్యాలెస్‌ నిర్మాణాన్ని సమర్థిస్తూ.. ఇది ప్రభుత్వ ఆస్తులే తప్ప జగన్‌మోహన్‌రెడ్డి ప్రైవేట్‌ సొత్తు కాదన్నారు.

నిర్మాణ నాణ్యతను సమర్థిస్తూ.. ''రాష్ట్రపతి లేదా ప్రధాని వైజాగ్‌ పర్యటనకు మీరు (టీడీపీ) ఉపయోగించుకునేలా అద్భుతంగా నిర్మించాం.. ఇది జగన్‌మోహన్‌రెడ్డి వ్యక్తిగత ఆస్తి కాదు.. ప్రభుత్వ ఆస్తి" అని అన్నారు.

Next Story