తిరుమలో విషాదం.. మెట్ల దారిలో గుండెపోటుతో నవవరుడి మృతి

తిరుమల అలిపిరి మెట్లదారిలో విషాద ఘటన చోటు చేసుకుంది. శ్రీవారి దర్శనానికి నడిచి వస్తున్న నవవరుడు గుండెపోటుతో మృతి చెందాడు.

By అంజి
Published on : 24 Aug 2024 6:20 AM IST

new bridegroom died, heart attack , Tirumala, Alipiri steps

తిరుమలో విషాదం.. మెట్ల దారిలో గుండెపోటుతో నవవరుడి మృతి

తిరుమల అలిపిరి మెట్లదారిలో విషాద ఘటన చోటు చేసుకుంది. శ్రీవారి దర్శనానికి నడిచి వస్తున్న నవవరుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్న 32 ఏళ్ల నవీన్‌కు 15 రోజుల కిందట పెళ్లి జరిగింది. ఈ క్రమంలోనే శుక్రవారం నాడు కుటుంబసభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి దర్శించుకోవాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా కుటుంబసభ్యులతో కలిసి తిరుపతికి చేరుకుని అక్కడి నుంచి అలిపిరి మెట్లమార్గంలో కాలినడకన తిరుమల బయలుదేరారు.

వీరు 2,350వ మెట్టు వద్దకు చేరుకోగానే నవీన్‌ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. సమీపంలోని భద్రతా సిబ్బంది అంబులెన్స్‌ ద్వారా నవీన్‌ను తిరుపతిలోని స్విమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే నవీన్‌ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గుండెపోటు కారణంగా అతడు మృతి చెందినట్టు తెలిపారు. తమిళనాడులోని తిరుత్తణి ప్రాంతానికి చెందిన ఆయన బెంగళూరులో స్థిరపడ్డాడు. ఈ ఘటనపై తిరుమల టూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story