చంద్రబాబు సీఎం కావాలని నాలుక కోసుకున్న వ్యక్తి

ఆంధ్రప్రదేశ్‌లో తన అభిమాన నేత సీఎం కావాలని ఓ వ్యక్తి తన నాలుక కోసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్‌ నగరంలో జరిగింది.

By అంజి  Published on  12 May 2024 7:30 PM IST
Chandrababu, Andhra Pradesh Polls, Hyderabad

చంద్రబాబు సీఎం కావాలని నాలుక కోసుకున్న వ్యక్తి 

ఆంధ్రప్రదేశ్‌లో తన అభిమాన నేత సీఎం కావాలని ఓ వ్యక్తి తన నాలుక కోసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్‌ నగరంలో జరిగింది. హైదరాబాద్‌ నగరంలోని శ్రీనగర్‌ కాలనీలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎం కావాలంటూ చెవల మహేష్‌ నాలుక కోసుకున్నాడు. పోలీసులు అతడిని అపోలో ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.

అతడి వద్ద లభించిన లేఖలో ''నా పేరు చెవల మహేష్. మాది పశ్చిమ గోదావరి జిల్లా గూటల గ్రామం. 2004లో వైఎస్‌ఆర్‌ సీఎం కావాలని, 2019లో వైఎస్‌ జగన్‌ సీఎం కావాలని నేను నా నాలుక కోసుకుని మొక్కు తీర్చుకున్నాను. ఇప్పుడు ఏపీలో టీడీపీ, జనసే, బీజేపీ కూటమి భారీ మెజార్టీతో గెలవాలని, ఏపీకి సీఎం చంద్రబాబు నాయుడు కావాలని, పవన్‌, లోకేష్‌ గెలవాలని నాలుక కోసుకున్నా'' అని రాశాడు. లేఖలో చివరలో తనకు ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు.

Next Story