తిరుపతి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్టేషన్ లూప్ లైన్‌లో ఉన్న రాయలసీమ, షిరిడీ ఎక్స్ ప్రెస్ రైళ్లలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. రెండు రైళ్లలోని బోగీల్లో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. బోగీలు పూర్తిగా కాలి దగ్ధమైపోయాయి. కాగా ప్రమాదం ఎలా జరిగింది ? ఎవరికైనా గాయాలయ్యాయా? అన్న వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు. ప్రమాదం జరగడంతో ఈ రూట్‌లో నడవాల్సిన పలు రైళ్లను తాత్కాలికంగా నిలిపివేశారు.