రేపు వైసీపీ కీలక సమావేశం.. దానిపైనే సీఎం జగన్‌ స్పెషల్‌ ఫోకస్

ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంటోది. అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు, ప్రతి వ్యూహాలు రచిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలపై వైసీపీ అధినేత, సీఎం జగన్‌ ప్రత్యేక దృష్టి పెట్టారు.

By అంజి
Published on : 26 Feb 2024 10:09 AM IST

YCP, CM YS Jagan, APnews, AP Politics

రేపు వైసీపీ కీలక సమావేశం.. సీఎం జగన్‌ స్పెషల్‌ ఫోకస్

ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంటోది. అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు, ప్రతి వ్యూహాలు రచిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలపై వైసీపీ అధినేత, సీఎం జగన్‌ ప్రత్యేక దృష్టి పెట్టారు. రేపు తాడేపల్లిలో పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. 175 నియోజకవర్గాలకు చెందిన నేతలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఎమ్మెల్యేలు, సమన్వయ కర్తలు, జిల్లా అధ్యక్షులు, రీజనల్‌ కో ఆర్డినేటర్‌లతో సమావేశం నిర్వహించనున్నారు. ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై నేతలకు సీఎం జగన్‌ దిశా నిర్దేశం చేయనున్నారు.

కాగా ఇప్పటికే 'సిద్ధం' సభలతో జగన్‌ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. మార్చి 3న బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం మేదరమెట్లలో వైసీపీ సిద్ధం సభ జరగనుంది. రాప్తాడులో నిర్వహించిన సభను మించి మేదరమెట్ల సభ నిర్వహించేలా వైసీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు గుంటూరు, పల్నాడు, బాపట్ల, నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల కార్యకర్తలు రానున్నారు. ఇప్పటికే భీమిలి, ఏలూరు, రాప్తాడులలో నిర్వహించిన 'సిద్ధం' సభలకు జనం భారీగా వచ్చారు.

Next Story