తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై కేసు నమోదు అయ్యింది. బాధితురాలు వరలక్ష్మీ ఫిర్యాదు మేరకు ఆదిమూలంపై తిరుపతి తూర్పు పోలీస్‌స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా తానూ ఎలాంటి తప్పూ చేయలేదని ఆదిమూలం చెప్పారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేకే వైసీపీ నేతలు కుట్ర చేశారని, టీడీపీకి నష్టం చేకూర్చనని అన్నాఉ. అధిష్ఠానం నిర్ణయాన్ని శిరసా వహిస్తానన్నారు. మహిళను అడ్డుపెట్టుకుని తనపై నిందలు వేశారని ఎమ్మెల్యే ఆదిమూలం వ్యాఖ్యానించారు. కాగా ఆదిమూలంను తెలుగుదేశం పార్టీ ఇప్పటికే సస్పెండ్ చేసింది.
లైంగిక వేధించడంతో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. భీమాస్ పారడైజ్ రూమ్ నంబర్ 105, 109 లో తన ఒప్పుకోలు లేకుండా బలవంతంగా తనపై అత్యాచారం చేసినట్లు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు బీఎన్‌ఎస్ చట్టంలోని సెక్షన్ Cr:430/2024 కింద కేసు నమోదు చేశారు. భీమాస్ పారడైజ్ హోటల్‌లో సీసీ ఫుటేజీని పోలీసులు సేకరించారు. అటు నేడో, రేపో తన ఎమ్మెల్యే పదవి ఆదిమూలం కి రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.