ఏపీ క‌రోనా బులిటెన్‌.. కొత్త‌గా ఎన్ని కేసులంటే..

839 New Corona Cases Reported In AP. ఏపీలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 42,679

By Medi Samrat
Published on : 20 Sept 2021 12:18 PM

ఏపీ క‌రోనా బులిటెన్‌.. కొత్త‌గా ఎన్ని కేసులంటే..

ఏపీలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 42,679 పరీక్షలు నిర్వహించగా.. 839 కేసులు నిర్ధారణ అయిన‌ట్లు సోమ‌వారం సాయంత్రం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,39,529కి చేరింది. నిన్న క‌రోనా వ‌ల్ల ఎనిమిది మంది మృత్యువాత ప‌డ్డారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,078కి చేరింది. 24 గంటల వ్యవధిలో 1,142 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,11,063కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,388 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,77,63,761 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.


Next Story