ఏపీలో అర్ధరాత్రి 12 గంటల వరకు 78.36 శాతం పోలింగ్.. అత్యధికం ఎక్కడంటే..
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకోగా..
By Medi Samrat Published on 14 May 2024 2:48 AM GMTఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకోగా.. రాష్ట్రం మొత్తంగా చూసుకుంటే ప్రశాంతంగానే పోలింగ్ ముగిసింది. సాయంత్రం ఆరు గంటలలోగా పోలింగ్ కేంద్రానికి చేరుకున్న అందరికీ ఓటు వేసే అవకాశం కల్పించడంతో.. కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు కూడా పోలింగ్ కొనసాగింది. ఈ మేరకు అర్ధరాత్రి 12 గంటల వరకు అందిన డేటాను అధికారిక యాప్‌లో ఎన్నికల సంఘం అప్‌డేట్ చేసింది. కాగా, ఈ దఫా ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ 78.36 శాతంగా నమోదయినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అత్యధికంగా డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 83.19 శాతం.. అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 63.19 శాతం పోలింగ్ నమోదయింది.
జిల్లాల వారీగా నమోదైన పోలింగ్ శాతం..
అల్లూరి సీతారామరాజు - 63.19 శాతం
అనకాపల్లి - 81.63 శాతం
అనంతపురం - 79.25 శాతం
అన్నమయ్య - 76.12 శాతం
బాపట్ల - 82.33 శాతం
చిత్తూరు - 82.65 శాతం
అంబేద్కర్ కోనసీమ - 83.19 శాతం
తూర్పు గోదావరి - 79.31 శాతం
ఏలూరు - 83.04 శాతం
గుంటూరు - 75.74 శాతం
కాకినాడ - 76.37 శాతం
కృష్ణా - 82.20 శాతం
కర్నూలు - 75.83 శాతం
నంద్యాల - 80.92 శాతం
ఎన్టీఆర్ - 78.76 శాతం
పల్నాడు -78.70 శాతం
పార్వతీపురం మన్యం - 75.24 శాతం
ప్రకాశం - 82.40 శాతం
పొట్టిశ్రీరాములు నెల్లూరు - 78.10 శాతం
శ్రీ సత్యసాయి - 82.77 శాతం
శ్రీకాకుళం - 75.41 శాతం
తిరుపతి - 76.83 శాతం
విశాఖపట్నం - 65.50 శాతం
పశ్చిమ గోదావరి -81.12 శాతం
వైఎస్సార్ - 78.12 శాతం