ఏపీలో నిన్నటితో పోలిస్తే నేడు కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 1,08,616 శాంపిళ్లను పరీక్షించగా.. 6,952 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 18,03,074కి చేరింది. నిన్న 11,577 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 16,99,775కి పెరిగింది.
కోవిడ్ వల్ల ప్రకాశం లో పదకొండు మంది, చిత్తూర్ లో తొమ్మి ది, తూర్పు గోదావరి లో ఆరుగురు, అనంతపూర్ లో ఐదుగురు, కృష్ణ లో ఐదుగురు, విశాఖపట్నం లో ఐదుగురు, శ్రీకాకుళం లో నలుగురు, పశ్చిమ గోదావరి లో నలుగురు, కర్నూల్ లో ముగ్గురు, గుంటూరు లో ఇద్దరు, విజయనగరం లో ఇద్దరు, వైఎస్ఆర్ కడప లో ఒక్కరు, నెల్లూరు లో ఒక్కరు చొప్పున మొత్తం 58 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 11,882కి చేరింది. ఇక రాష్ట్రంలో 91,417 యాక్టివ్ కేసులు ఉండగా.. నేటి వరకు రాష్ట్రంలో 2,03,48,106 సాంపిల్స్ ని పరీక్షించారు.