ఏపీలో క‌రోనా కేసుల వివ‌రాలిగో..

624 New Corona Cases Reported In AP. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 38,312

By Medi Samrat
Published on : 10 Oct 2021 12:08 PM

ఏపీలో క‌రోనా కేసుల వివ‌రాలిగో..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 38,312 పరీక్షలు నిర్వహించగా.. 624 కేసులు నిర్ధారణ అయిన‌ట్లు ఆదివారం సాయంత్రం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,57,252కి చేరింది. నిన్న క‌రోనా వ‌ల్ల న‌లుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,254కి చేరింది. 24 గంటల వ్యవధిలో 810 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,35,054కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 7,944 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,87,44,941 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.



Next Story