ఏపీ కరోనా బులిటెన్.. 24 గంటల్లో 11 మంది మృత్యువాత..
5983 New Corona Cases reported In AP. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ సృష్టిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు
By Medi Samrat
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ సృష్టిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు సంఖ్య మళ్లీ 5 వేలకుపైగా నమోదయ్యాయి. కేసులు పెరగుతుండటంతో మరణాలు కూడా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 35,040 పరీక్షలు నిర్వహించగా.. 5,983 కొత్త పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు బుధవారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 22,88,566కి చేరింది.
#COVIDUpdates: 02/02/2022, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) February 2, 2022
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 22,88,566 పాజిటివ్ కేసు లకు గాను
*21,73,313 మంది డిశ్చార్జ్ కాగా
*14,631 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,00,622#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/26JS3vjGeB
కరోనా వల్ల నిన్న పదకొండు మృత్యువాత పడ్డారు. కోవిడ్ వల్ల విశాఖపట్నం లో నలుగురు, కడప లో ఇద్దరు, చిత్తూరు, గుం టూరు, నెల్లూరు, ప్రకాశం మరియు పశ్చి మ గోదావరి లలో ఒక్కొక్కరు చొప్పు న మరణించారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,631గా ఉంది. 24 గంటల వ్యవధిలో 11,280 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 21,73,313కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,00,622 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,25,40,787 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.