ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 506 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఐదుగురు మరణించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మృతుల సంఖ్య 7,057కు చేరగా, పాజిటివ్ కేసుల సంఖ్య 8,75,025కు చేరింది. తాజాగా 613 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం రాష్ట్రంలో 4966 యాక్టివ్ కేసులున్నట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,08,30,990 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది. ఇక గడిచిన 24 గంటల్లో అత్యధికంగా చిత్తూరులో 104, గుంటూరులో 69, కృష్ణలో 59 కేసులు, పశ్చిమగోదావరిలో 66 కేసులు నమోదు కాగా.. మిగతా జిల్లాల్లో యాభై లోపు కేసులు నమోదయ్యాయి.