ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. నిన్న‌టితో పోల్చితే ఇవాళ కరోనా కేసులు భారీగా న‌మోద‌య్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 47,884 పరీక్షలు నిర్వహించగా..4,348 కొత్త పాజిటివ్ కేసులు నిర్ధారణ అయిన‌ట్లు గురువారం సాయంత్రం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,92,227కి చేరింది. కోవిడ్ వల్ల కృ ష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు.

రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,507గా ఉంది. 24 గంటల వ్యవధిలో 261 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,63,516కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,204 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు లో 3,17,56,521 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

Next Story