ఏపీ క‌రోనా బులిటెన్‌.. కొత్త‌గా ఎన్ని కేసులంటే..

396 New Corona Cases Reported In AP. ఏపీలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 40,855 పరీక్షలు

By Medi Samrat  Published on  23 Oct 2021 11:34 AM GMT
ఏపీ క‌రోనా బులిటెన్‌.. కొత్త‌గా ఎన్ని కేసులంటే..

ఏపీలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 40,855 పరీక్షలు నిర్వహించగా.. 396 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయిన‌ట్లు శ‌నివారం సాయంత్రం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,63,177కి చేరింది. నిన్న క‌రోనా వ‌ల్ల ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,339కి చేరింది. 24 గంటల వ్యవధిలో 566 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,43,616కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,222 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,92,26,511 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.


Next Story