Train accident: 33 రైళ్లు రద్దు, 6 రైళ్లు రీషెడ్యూల్
ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరంలో ఘోర రైలు ప్రమాదం కారణంగా ఇప్పటి వరకు 33 రైళ్లను రద్దు చేయగా, మరో ఆరు రైళ్లను రీషెడ్యూల్ చేసినట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే తెలిపింది.
By అంజి Published on 30 Oct 2023 10:38 AM ISTTrain accident: 33 రైళ్లు రద్దు, 6 రైళ్లు రీషెడ్యూల్
ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరంలో రెండు రైళ్లు ఢీకొన్న దుర్ఘటనలో ఇప్పటి వరకు 13 మంది మృతి చెందారు. ఈ ఘోర రైలు ప్రమాదం కారణంగా ఇప్పటి వరకు 33 రైళ్లను రద్దు చేయగా, మరో ఆరు రైళ్లను రీషెడ్యూల్ చేసినట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు సోమవారం తెలిపారు. వాల్తేర్ పరిధిలోని కంటకపల్లె - అలమనాడ స్టేషన్‌ల మధ్య రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీకొన్న ప్రమాదం తర్వాత మొత్తం 33 రైళ్లను రద్దు చేశామని, 24 రైళ్లను దారి మళ్లించామని, 11 పాక్షికంగా రద్దు చేసినట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే, భువనేశ్వర్ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ అధికారి బిశ్వజిత్ సాహు ధృవీకరించారు. ఇందులో ఈ ఉదయం మూడు రైళ్లు రద్దు చేయబడ్డాయి. రెండు రీషెడ్యూల్ చేయబడ్డాయి.
చెన్నై సెంట్రల్ నుండి పూరీ (22860), రాయగడ నుండి గుంటూరు (17244), విశాఖపట్నం నుండి గుంటూరు (17240) ,చెన్నై సెంట్రల్ నుండి షాలిమార్ (12842) వరకు రద్దు చేయబడ్డాయి. అలెప్పీ నుండి ధన్‌బాద్ (13352) రైలును ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు ఈరోజు రీషెడ్యూల్ చేసారు.
ఈ రైళ్లు కూడా రద్దయ్యాయి
30 అక్టోబర్ – రైలు నం. 08527 – రాయ్‌పూర్-విశాఖపట్నం ప్యాసింజర్
30 అక్టోబర్ – విశాఖపట్నం నుండి – రైలు నం. 08528 – విశాఖపట్నం-రాయ్‌పూర్ ప్యాసింజర్
30 అక్టోబర్ – రాయ్‌పూర్ నుండి – రైలు నం. 08527 – రాయ్‌పూర్-విశాఖపట్నం ప్యాసింజర్
30 అక్టోబర్ – విశాఖపట్నం నుండి – రైలు నం. 08528 – విశాఖపట్నం-రాయ్‌పూర్ ప్యాసింజర్
30 అక్టోబర్ – పలాస నుండి – పలాస-విశాఖపట్నం స్పెషల్
30 అక్టోబర్ – పారాదీప్ నుండి – పారాదీప్-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్
30 అక్టోబర్ – కోర్బా నుండి – కోర్బా-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్
30 అక్టోబర్ – రాయగడ నుండి – రాయగడ-విశాఖపట్నం ప్యాసింజర్
30 అక్టోబర్ – విజయనగరం నుండి – విజయనగరం-విశాఖపట్నం స్పెషల్
30 అక్టోబర్ – విశాఖపట్నం నుండి – విశాఖపట్నం-గుణపూర్ స్పెషల్
ఆదివారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో విశాఖపట్నం-రగడ ప్యాసింజర్ రైలు అదే మార్గంలో ప్రయాణిస్తున్న విశాఖపట్నం-రగడ రైలును ఢీకొనడంతో కోచ్‌లు పట్టాలు తప్పడంతో కనీసం 13 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. 3 కోచ్‌లు ప్రమాదానికి గురైనట్లు డివిజనల్ రైల్వే మేనేజర్ తెలిపారు. ఈ ప్రమాదంలో మూడు కోచ్‌లు ఉన్నాయి. రెస్క్యూ కార్యకలాపాలు జరుగుతున్నాయి. క్షతగాత్రులను విశాఖపట్నం, విజయనగరం ఆసుపత్రులకు తరలిస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే సీనియర్ రైల్వే అధికారి తెలిపారు.
కేంద్రంపై ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్ర ప్రదేశ్‌లో రైలు పట్టాలు తప్పిన ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సోమవారం మోడీ ప్రభుత్వంపై మండిపడ్డారు, రైళ్లను ఆర్భాటంగా ఫ్లాగ్ చేయడంలో చూపించిన ఉత్సాహం రైల్వే భద్రత, ప్రయాణీకుల శ్రేయస్సు పట్ల చూపాలని అన్నారు. ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో, ఖర్గే ఇలా అన్నారు, ''ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో రైలు పట్టాలు తప్పిన దుర్ఘటన గురించి తెలుసుకున్నందుకు చాలా బాధపడ్డాను, ఇక్కడ విలువైన ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు.మృతుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని, కాంగ్రెస్ కార్యకర్తలు అన్ని విధాలా సాయం అందించాలని కోరారు. బాలాసోర్ రైలు దుర్ఘటన తర్వాత భద్రతపై కేంద్ర ప్రభుత్వం చేసిన వాదనలన్నీ గాలిలో ఆవిరైపోయినట్లు కనిపిస్తోంది'' అని అన్నారు.