ఏపీలో క‌రోనా విల‌యం..

22517 New Corona Cases reported In AP. ఏపీలో క‌రోనా విల‌యం కొనసాగుతూనే ఉంది. గ‌త కొద్ది రోజులుగా నిత్యం 20వేల‌కు పైనే

By Medi Samrat  Published on  15 May 2021 2:36 PM GMT
ఏపీలో క‌రోనా విల‌యం..

ఏపీలో క‌రోనా విల‌యం కొనసాగుతూనే ఉంది. గ‌త కొద్ది రోజులుగా నిత్యం 20వేల‌కు పైనే పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 89,535 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా.. 22,517 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శ‌నివారం సాయంత్రం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 14,11,320కి చేరింది. నిన్న 18,739 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 11,94,582కి పెరిగింది.

కొవిడ్ వ‌ల్ల అనంత‌పురంలో 12 మంది, నెల్లూరులో 11మంది, తూర్పుగోదావ‌రిలో 10మంది, విశాఖ‌ప‌ట్నంలో 9 మంది, విజ‌య‌న‌గ‌రంలో 9 మంది, చిత్తూరులో 8 మంది, శ్రీకాకుళంలో 8 మంది, గుంటూరులో ఏడుగురు, ప‌శ్చిమ గోదావరిలో ఏడుగురు, కృష్ణ‌లో 5, క‌ర్నూల్‌లో 5, ప్ర‌కాశంలో 5, క‌డ‌ప‌లో 2 చొప్పున మొత్తం 98 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 9,271కి చేరింది.


Next Story
Share it