ఏపీ క‌రోనా బులిటెన్‌.. మ‌ళ్లీ పెరిగిన కేసులు

2,010 New Corona Cases Reported In AP. ఏపీలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 70,695 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా..

By Medi Samrat  Published on  28 July 2021 6:32 PM IST
ఏపీ క‌రోనా బులిటెన్‌.. మ‌ళ్లీ పెరిగిన కేసులు

ఏపీలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 70,695 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా.. 2,010 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బుధ‌వారం సాయంత్రం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 19,59,942కి చేరింది. నిన్న 1,956 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,25,631కి పెరిగింది.

కోవిడ్ వల్ల కృష్ణ లో నలుగురు, చిత్తూర్ లో ముగ్గురు, పశ్చిమ గోదావరి లో ముగ్గురు, తూర్పు గోదావరి లో ఇద్దరు, నెల్లూరు లో ఇద్దరు, ప్రకాశం లో ఇద్దరు, గుంటూరు, వైఎస్ఆర్ కడప, కర్నూల్, శ్రీకాకుళం లలో ఒక్కొక్కరు చొప్పున 20 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 13,312కి చేరింది. ఇక రాష్ట్రంలో 20,999 యాక్టివ్ కేసులు ఉండ‌గా.. నేటి వరకు రాష్ట్రంలో 2,43,24,626 సాంపిల్స్ ని పరీక్షించారు.


Next Story