నిన్నటితో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 70,727 శాంపిళ్లను పరీక్షించగా.. 1,843 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 19,48,592కి చేరింది. నిన్న 2,199 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,11,812కి పెరిగింది.
కోవిడ్ వల్ల ప్రకాశం లో ముగ్గురు, చిత్తూర్ లో ఇద్దరు, తూర్పు గోదావరి లో ఇద్దరు, కర్నూల్ లో ఇద్దరు, నెల్లూరు లో ఇద్దరు, కృష్ణ లో ఒక్కరు చొప్పున 12 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 13,209కి చేరింది. ఇక రాష్ట్రంలో 23,571 యాక్టివ్ కేసులు ఉండగా.. నేటి వరకు రాష్ట్రంలో 2,39,09,363 సాంపిల్స్ ని పరీక్షించారు.