నిన్నటితో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 65,920 శాంపిళ్లను పరీక్షించగా.. 1,747 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 19,50,339కి చేరింది. నిన్న 2,365 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,14,177కి పెరిగింది.
కోవిడ్ వల్ల చిత్తూర్ లో నలుగురు, గుంటూరు లో ముగ్గురు, కృష్ణ లో ఇద్దరు, నెల్లూరు లో ఇద్దరు, తూర్పు గోదావరి లో ఒక్క రు, ప్రకాశం లో ఒక్కరు, విశాఖపట్నంలో ఒక్కరు చొప్పున 14 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 13,223కి చేరింది. ఇక రాష్ట్రంలో 22,939 యాక్టివ్ కేసులు ఉండగా.. నేటి వరకు రాష్ట్రంలో 2,39,75,283 సాంపిల్స్ ని పరీక్షించారు.