ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 77,148 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 1,728 కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,49,705కి చేరింది. కొవిడ్‌ వల్ల చిత్తూరులో ముగ్గురు, కృష్ణ‌లో ఇద్ద‌‌రు, అనంత‌పూ‌ర్‌లో ఒక్క‌రు, తూర్పుగోదావ‌రిలో ఒక్క‌రు, గుంటూరులో ఒక్క‌రు, ప‌శ్చిమ‌గోదావ‌రిలో ఒక్క‌రు చొప్పున 9 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 6,837కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 8,22,011 మంది కోలుకుని, డిశ్చార్జి కాగా.. 20,857 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.


సామ్రాట్

Next Story