ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ ఆగడం లేదు. రాష్ట్రంలో ఇవాళ కూడా కరోనా కేసులు సంఖ్య పదిహేను వందలకుపైగా నమోదయ్యాయి. నిన్నటితో పోల్చితే కరోనా మరణాలు ఈ రోజు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 27,522 పరీక్షలు నిర్వహించగా.. 1,679 కొత్త పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు బుధవారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,08,622కి చేరింది.
కరోనా వల్ల నిన్న ఇద్దరు మృత్యువాత పడ్డారు. కోవిడ్ వల్ల చిత్తూరు మరియు కృష్ణా లలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,679గా ఉంది. 24 గంటల వ్యవధిలో 9,598 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 22,47,824కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 46,119 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,27,33,046 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.