ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 30,859 పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 160 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు ఆదివారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,74,868కి చేరింది. కరోనా వల్ల నిన్న ఒక్కరు మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,466గా ఉంది. 24 గంటల వ్యవధిలో 201 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,58,490కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,912 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,07,77,396 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.