ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసులు మళ్లీ పెరిగాయి. తాజా కరోనా బులెటిన్‌ ప్రకారం.. మళ్లీ కొత్త కేసులు వెయ్యికి పైగా నమోదు అయ్యాయి. గడిచిన‌ 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 66,002 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 1,221 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. కరోనాబారినపడి 10 మంది మృతిచెందారు.

ఇదే సమయంలో 1,829 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. తాజా కరోనా నిర్ధారణ పరీక్షలు కలుపుకొని ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా టెస్ట్‌ల సంఖ్య 94,74,870కు చేరింది. తాజాగా చిత్తూరు, కృష్ణా జిల్లాల‌లో ఇద్దరు చొప్పున, తూర్పు గోదావరి, గుంటూరు, క‌ర్నూల్‌, నెల్లూరు, ప్ర‌కాశం, విశాఖ‌ప‌ట్నం జిల్లాల‌లో ఒక్కరు చొప్పున మరణించారు.

ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 8,59,932కు చేరుకోగా.. ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 8,37,630కు పెరిగింది. ఇక 6,920 మంది ఇప్పటి వరకు కరోనాబారినపడి మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 15,382 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.


సామ్రాట్

Next Story