ఏపీ క‌రోనా బులిటెన్‌.. స్వ‌ల్పంగా త‌గ్గిన కేసులు

1167 New Corona Cases Reported In AP. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా

By Medi Samrat  Published on  25 Sep 2021 2:30 PM GMT
ఏపీ క‌రోనా బులిటెన్‌.. స్వ‌ల్పంగా త‌గ్గిన కేసులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 55,307 పరీక్షలు నిర్వహించగా.. 1,167 కేసులు నిర్ధారణ అయిన‌ట్లు శ‌నివారం సాయంత్రం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,45,657కి చేరింది. నిన్న క‌రోనా వ‌ల్ల ఏడుగురు మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,125కి చేరింది. 24 గంటల వ్యవధిలో 1,487 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,18,324కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 13,208 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,80,36,099 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.



Next Story