తెలుగు రాష్ట్రాల్లో.. నేటి నుంచి టెన్త్ పరీక్షలు

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏపీలో 7,25,620 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.

By అంజి  Published on  18 March 2024 1:05 AM GMT
10th class exams, AndhraPradesh, Telangana

తెలుగు రాష్ట్రాల్లో.. నేటి నుంచి టెన్త్ పరీక్షలు

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏపీలో 7,25,620 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరగనున్నాయి. ఏపీలో ఈ నెల 30వ తేదీతో పరీక్షలు ముగుస్తాయి. వారిలో రెగ్యులర్‌ విద్యార్థులు 6,23,092 మంది, రీఎన్‌రోల్‌ అయినవారు 1,02,528 మంది ఉన్నారు. రెగ్యులర్‌ విద్యార్థుల్లో 3,17,939 మంది బాలురు, 3,05,153 మంది బాలికలు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3,473 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏపీలో విద్యార్థులకు ఎలాంటి గ్రేస్‌ పీరియడ్ ఇవ్వలేదు.

తెలంగాణలో 5,08,385 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. అందులో బాలురు 2,57,952 మంది, బాలికలు 2,50,433 మంది ఉన్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. తెలంగాణలో విద్యార్థులకు ఐదు నిమిషాల (ఉదయం 9.35 వరకు) గ్రేస్‌ పీరియడ్‌ ఇచ్చారు. ఆ తర్వాత వచ్చిన విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరు. ఈ పరీక్షలు ఏప్రిల్ 2వ తేదీ వరకు జరుగుతాయి. ఈ పరీక్షలకు 2676 ఛీఫ్ సూపరింటెండెంట్‌లు, 2676 డిపార్ట్‌మెంటల్ అధికారాలను, 30 వేల మంది ఇన్విజిలేటర్లను నియమించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్‌ టికెట్‌ చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.

Next Story