రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులకు 1000 కోట్లు నిధులు మంజూరు
అమరావతి: రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులకు 1000 కోట్లు నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో మొత్తం 274 రోడ్డు పనుల కోసం రూ. 1000 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో రాష్ట్ర రహదారుల పనుల కోసం రూ.500 కోట్లు మంజూరు చేసింది. మరోవైపు మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్ల పనుల కోసం రూ.600 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.