జీఎస్టీ తగ్గింపుతో ప్రజారోగ్యంపై వ్యయంలో రూ.1,000 కోట్లు ఆదా!
జీఎస్టీ పన్నుల తగ్గింపుతో రాష్ట్ర ఆరోగ్య రంగంలో సుమారు రూ.1,000 కోట్లు వరకు ఆదా కానుంది.
By - Medi Samrat |
జీఎస్టీ పన్నుల తగ్గింపుతో రాష్ట్ర ఆరోగ్య రంగంలో సుమారు రూ.1,000 కోట్లు వరకు ఆదా కానుంది. ప్రాణధార మందులపై తగ్గించిన పన్నుతో ప్రజలు నేరుగా కొనుగోలుచేసే మందులు, సర్జికల్స్పై రూ.716 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జరిగే కొనుగోళ్లలో రూ.250 కోట్లు వరకు వ్యయం తగ్గుతుందని అంచనా వేస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. 2024-25 ఆర్ధిక సంవత్సరంలో జరిగిన కొనుగోళ్ల ఆధారంగా ఇకపై సుమారు రూ.1,000 కోట్లు వరకు ప్రజారోగ్యంపై భారం తగ్గుతుందని అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఓ పత్రికా ప్రకటన విడుదలచేశారు ' గత నెల 21వ తేదీ వరకు 12%, 5% చొప్పున మందులపై జీఎస్టీ ఉండేది 12% కేటగిరిలోనే 99% మందులు ఉన్నాయి. 12% పన్నును 5%కు కేంద్రం తగ్గించింది. దీనివల్ల ప్రస్తుత మందులపై 7% వరకు పన్ను తగ్గింది. క్యాన్సర్, ఇతర అరుదైన కేటగిరిలో ఉన్న 33 రకాల మందులపై 12% వరకు ఉన్న పన్నును కేంద్రం పూర్తిగా తొలగించింది. దీనివల్ల ప్రజారోగ్యానికి భారీ ఊరట లభించింది' అని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో 35,000 మందుల దుకాణాలు
"రాష్ట్రంలో సుమారు 35 వేల వరకు మందుల దుకాణాలు, 5 వేల వరకు టోకు వర్తక సంస్థలు ఉన్నాయి. వీటి ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరంలో 11,250 కోట్ల విలువైన మందులు, సర్టికల్స్ విక్రయాలు జరిగాయి. దీని ప్రకారం రూ.1,350 కోట్లు వరకు పన్నుల భారం ప్రజలపై పడినట్లు రాష్ట్ర ఔషధ నియంత్రణ పరిపాలనా విభాగం తెలిపింది. ఇకపై ప్రజలు నేరుగా మందుల కొనుగోలు చేయడంపై పడే జీఎస్టీ భారంలో రూ.703 కోట్ల వరకు ఆర్థిక భారం తగ్గింది. ఇవి కాకుండా క్యాన్సర్, ఇతర అరుదైన మందుల కొనుగోళ్లు రాష్ట్రంలో రూ.112 కోట్ల వరకు ఉంటుందని అంచనా వీటిపై 12% పన్ను పూర్తిగా తొలగించినందున సుమారు రూ.13 కోట్ల వరకు బాధితులకు ఉపశమనం లభిస్తుందని అంచనా. సదరు సంస్థలు ఖరారుచేసే ఎంఆర్పీల్లోనే జీఎస్టీ ఇమిడి ఉంది. తాజాగా 12% జీఎస్టీని 5%కు తగ్గించినందున ఎంఆర్పీ ధర 6% నుంచి 7% వరకు తగ్గింది. ఈ కేటగిరిలోనే 99% మందులు ఉన్నాయి" అని మంత్రి సత్యకుమార్ వివరించారు.
ఔషధ నియంత్రణ పరిపాలనా విభాగం పేర్కొన్న ప్రకారం....*
"పారాసిటమాల్ ఒక షీట్ ధర గత నెల 21వ తేదీ వరకు 12% జీఎస్టీతో కలిపి రూ.28గా ఉంది. తగ్గిన gst tho కొత్త ధర రూ.26.04.
* మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉపయోగించే మెటఫార్మిన్ 500 ఎంజీ (గైసిఫేజ్) రూ.41.65 నుంచి రూ.38.73 (-రూ.2.92 పైసలు)
*రక్తపోటు అదుపునకు ఉపయోగించే టెల్మిసార్టన్ -40 ఎంజీ రూ.113.7 నుంచి రూ.105.74 (-రూ.7.96 పైసలు) కు తగ్గింది. అగ్యుమెంటిన్ 625 ఎంజీ (యాంటీబయాటిక్) రూ.204.86 నుంచి రూ.190.51 (-రూ.14.35)కు తగ్గింది.
*మదుమేహ వ్యాధిగ్రస్తులు వినియోగించే హ్యూమన్ ఇన్సులిన్ ధర రూ.454 నుంచి రూ.422.02(-రూ.31.08)కు చేరింది.
*పాంటాప్-40 లాంటి గ్యాస్ట్రిక్ ట్యాబెలెటు షీటు ధర రూ.170 నుంచి రూ.158.10 (-రూ.11,900కు తగ్గింది 33 రకాల మందులపై 12% పన్ను పూర్తిగా తొలగించారు.
క్యాన్సర్, ఇతర అరుదైన మందుల ధరలపై జీఎస్టీని పూర్తిగా తొలగించారు. దీనిప్రకారం ఫెజిలాటెడ్ లైపోజోమాల్ (ఓనీవైడ్) ఇంజక్షన్ (వయల్) ధర రూ.4,80,000గా ఉంది. కొత్త ధర రూ.4,28,570 దీనివల్ల బాధితుడికి రూ.51,430 ఆదా అయింది.
దారాటూమాబ్ 35,000(డార్టాలెక్స్-ఫాసిప్రో800ఎంజీ) ఇంజక్షన్ (వయల్) ధర గత నెల 21వ తేదీ వరకు 2,30,150గా ఉండేది. దీని ధర ప్రస్తుతం 2,10,450 అయింది ఆదా రూ.28,700.
* ఇమిగ్లిసిరేజ్ (సెరిజైమ్) ఇంజక్షన్ (వయల్) పై ఉన్న 5% జీఎస్టీని తొలగించినందున రూ.3,70,000 నుంచి రూ.3,52,381కు అందుబాటులోనికి వచ్చింది.
ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టుకు రూ.203.85 కోట్లు ఆదా!
* ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు ద్వారా 2024-25 ఆర్ధిక సంవత్సరంలో రూ.4,077 కోట్లు విలువైన ప్రీ ఆథరైజేషన్లు ఇచ్చారు. ఇందులో రూ.2,308.56 కోట్లు మెడికేషన్, కన్జుమబుల్స్ కింద ఉన్నాయి. ప్రస్తుతం తగ్గిన ధరలవల్ల రూ.203.85 కోట్లు వరకు ఆదా అవుతుందని అంచనా.
మందులు, సర్జికల్ కొనుగోళ్ల ద్వారా రూ.40 కోట్లు!
"రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాలు, అభివృద్ధి సంస్థ తరపున 2024-25 ఆర్ధిక సంవత్సరంలో రూ.679 కోట్లతో మందులు, సర్జికల్ ఐటమ్స్, ఇంప్లాంట్లు, డయాగ్నస్టిక్ కిట్లు, ఇతర వాటిని కొనుగోలుచేశాం. ఇందులో రూ.71 కోట్లు జీఎస్టీ కింద చెల్లిందాం జీఎస్టీ-2.0 కారణంగా ఈ రూ.71 కోట్లులో రూ.40 కోట్లు ఇకపై చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇలా పరిశీలిస్తే.. ప్రతి ఏడాది జీఎస్టీ సంస్కరణల వల్ల సగటున రూ.250 కోట్లు వరకు ఆదా అవుతుందని అంచనా వేస్తున్నాం " అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వివరించారు.