ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 10 మంది దుర్మరణం

10 dead in car-bus collision near Mysuru. కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

By M.S.R  Published on  29 May 2023 1:30 PM GMT
ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 10 మంది దుర్మరణం

కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మైసూరు సమీపంలో ఓ ప్రైవేటు బస్సు, కారు ఢీకొన్న ఘటనలో 10 మంది దుర్మరణం చెందారు. మృతి చెందినవారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. తిరుమకుడాలు, నరసిపురా మధ్య ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మరణించిన వారందరూ ఒకే కుటుంబానికి చెందినవారు. బళ్లారి నుంచి వారు మైసూరు సందర్శనకు బయల్దేరారు. వీరు ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనాన్ని ఓ ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. దాంతో ఇన్నోవా వాహనం నుజ్జునుజ్జయింది. 10 మంది సంఘటన స్థలంలో ప్రాణాలు విడిచారు. మరికొందరిని బయటికి తీసి ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. కారులో ఉన్నవారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. నర్సీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


Next Story