సూర్యాపేటలో దారుణం...వరుసకు కూతురయ్యే బాలికపై తండ్రి అత్యాచారం

By Newsmeter.Network  Published on  5 Dec 2019 7:49 AM GMT
సూర్యాపేటలో దారుణం...వరుసకు కూతురయ్యే బాలికపై తండ్రి అత్యాచారం

వరుసకు కూతురయ్యే బాలికపై అత్యాచారం చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వరుసకు తండ్రి అయ్యే వ్యక్తి 16 సంవత్సరాల మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన ఓ మహిళకు పదేళ్ల క్రితం భర్త చనిపోయాడు. తన ఇద్దరు కుమారులు, కుమార్తె తో స్థానిక గొల్ల బజారు లోని ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో ఆ మహిళకు అదే జిల్లా చివ్వేంల మండలం మున్య నాయక్ తండాకు చెందిన బాణోత్ శ్రీను తో పరిచయం ఏర్పడి సహజీవనం చేస్తున్నారు. కాగా, చదువు మధ్యలో ఆపేసిన బాలిక తల్లితో కలిసి కూలి పనులకు వెళ్ళేది. గత కొంత కాలంగా బాలిక పై కన్నేసిన ఈ కామంధుడు బాలికను లైoగికంగా వేధించసాగాడు.

పది రోజుల క్రితం తల్లి కూలి పనికి వెళ్లగా, ఒంటరిగా ఉన్న బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం తల్లితో చెబితే అందరిని చంపేస్తానని బెదిరించడంతో భయపడిన బాలిక... విషయాన్నితల్లికి చెప్పలేదు. దీనిని అదనుగా తీసుకున్న నిందితుడు పలుమార్లు తన దగ్గరకు రావాలని బెదిరిస్తుండటంతో బాలిక విషయాన్ని తల్లికి చెప్పింది. దీంతో కూతురితో కలిసి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్నపోలీసులు కామాంధుడిని అరెస్టు చేశారు.

Next Story
Share it