కనుమరుగు కానున్న ఆంధ్రా బ్యాంక్‌.. రేపు యూనియన్‌ బ్యాంక్‌లో విలీనం

By Newsmeter.Network  Published on  31 March 2020 9:10 AM IST
కనుమరుగు కానున్న ఆంధ్రా బ్యాంక్‌.. రేపు యూనియన్‌ బ్యాంక్‌లో విలీనం

ప్రభుత్వ రంగ బ్యాంకులను బలోపేతం చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల విలీన ప్రక్రియను చేపడుతుంది. దీనిలో భాగంగా ఆంధ్రా బ్యాంక్‌తో పాటు పలు బ్యాంకులు రేపు (బుధవారం) యూనియన్‌ బ్యాంక్‌లో విలీనం కానున్నాయి. కొన్ని నెలల క్రితమే బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, విజయా బ్యాంకు, దేనా బ్యాంకులను విలీనం చేసిన విషయం విధితమే. తాజాగా మరో 10 బ్యాంకులను కలిసి నాలుగు పెద్ద బ్యాంకులుగా ఏర్పాటు చేయనున్నారు. వీటిలో పంజాబ్‌ నేషల్‌ బ్యాంకులో ఓరియంటల్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ - ఓబీసీ, యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా - యూబీఐ, కెనరా బ్యాంకులో సిండకేట్‌ బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఆంధ్రా బ్యాంక్‌, కార్పొరేషన్‌ బ్యాంక్‌, ఇండియన్‌ బ్యాంకులో అలహాబాద్‌ బ్యాంక్‌ విలీనం కానున్నాయి.

Also Read :ఏప్రిల్‌ 7 నాటికి కరోనా ఫ్రీ తెలంగాణ సాధ్యమేనా? కేసీఆర్‌ వ్యాఖ్యలు నిజమెలా అవుతాయి?

తెలుగు నేలపై పురుడు పోసుకున్న ఏకైక జాతీయ బ్యాంకు ఆంధ్రా బ్యాంకు కావటం విశేషం. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులలో ఒకరైన డాక్టర్‌ భోగరాజు పట్టాభి సీతారామయ్య ఆంధ్రా బ్యాంకును కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రధాన కేంద్రంగా స్థాపించారు. 1923 నవంబర్‌ 20న ఈ బ్యాంకు పేరు రిజిస్టర్‌ అయింది. లక్ష రూపాయల మూలధనం, రూ. 10లక్షల అధీకృత మూలధనంతో 1923 నవంబర్‌ 28న ఈ బ్యాంక్‌ కార్యకలాపాలను ప్రారంభించింది. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో 1980లో ఈ బ్యాంకును జాతీయం చేశారు. జాతీయం చేసినప్పుడు ఆంధ్రాబ్యాంకు 974 పూర్తిస్థాయి శాఖలు, 40 క్లస్టర్‌ బ్రాంచ్‌లు, 76 ఎక్స్‌ టెన్షన్‌ కౌంటర్లు ఉండేవి. ప్రస్తుతం ఈ బ్యాంక్‌లో 2,904 శాఖలు ఉన్నాయి. 21,740 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఈ బ్యాంక్‌ హైదాబాద్‌ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

Also Read :ఏప్రిల్‌ 2వరకు కీలక దశ.. కరోనాపై బాల జ్యోతీష్యుడు ఏం చెప్పాడంటే..?

ఆంధ్రాబ్యాంక్‌ను విలీనం చేయడాన్ని పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నా విలీనం ఆగడం లేదు. ఏకైన తెలుగు జాతీయ బ్యాంక్‌ను విలీనం చేయవద్దని, తెలుగువారంతా విన్నపాలు చేసినా, ఎన్ని ఉద్యమాలు నిర్వహించినా కేంద్రం ఆంధ్రా బ్యాంక్‌ను విలీనం చేస్తోంది. విలీనం పట్ల బ్యాంకు డైరెక్టర్ల బంధువులు, బ్యాంకు రిటైర్డ్‌ ఉద్యోగులు పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Next Story