'మూతి కడుక్కొస్తే ముద్దిస్తది ఓకే'.. మరి అది కావాలంటేనో..!
By Newsmeter.Network Published on 26 Dec 2019 12:14 PM IST
అరే.. ఎందిరా భయ్ ఇది. ముద్దేంది.. మూతి కడుక్కొచ్చుడేంది..? అసలు దీని యవ్వారమేంది..? అని కన్ఫ్యూజ్ అయ్యే వారికి జబర్దస్త్ గెటప్ శ్రీను స్టైల్లో చెప్పాలంటే..? ఇప్పుడు ఇల్లుందా..? ఇంట్లో టేబుల్ ఉందా..? టేబుల్‌పైన టీవీ ఉందా..? టీవీకి ఆనుకుని గుమ్మముందా..? ఆ గుమ్మానికి ఎదురుగా ప్రహరీ గోడ ఉందా..?
ఆ..ఆ.. అలా చెప్పు.. ఆ ప్రహరీగోడ చాటున ఉన్న ఓ జంటలోని లేడీ తన ప్రియుడ్ని ముద్దు కావాలంటే మూతి కడుక్కుని రమ్మంది కదూ..! అబ్బే కాదండీ.. ఆ తతంగమంతా జరిగింది టీవీలోనే. మరి ఇల్లు, టేబుల్, గుమ్మం, ప్రహరీగోడ ఇవన్నీ ఎందుకు చెప్పావురా..? అవన్నీ మా ఇంట్లో ఉన్నాయని చెప్పడానికండీ..!
అయినా, ఇక్కడ గెటప్ శ్రీను చెప్పింది అక్షరాల నిజమండి బాబా. ఓ బుల్లితెర షోలో ముద్దు కావాలనిపించినప్పుడు మూతి కడుక్కొని రావొచ్చు కదా..? హగ్ కావాలనిపించినప్పుడు స్నానం చేసి రావొచ్చు కదా..? అంటూ అబ్బాయిలపై ఓ కో - యాంకరు ప్రశ్నల వర్షం కురిపించింది. ఇంతకీ ఆ షోలో ఈ ముద్దులు, హగ్గుల ప్రస్థావన ఎందుకు వచ్చిందన్నది తెలుసుకోవాలంటే ఈ మొత్తాన్ని చదివేయాల్సిందే మరీ..!
ఇక సుత్తిలేకుండా అసలు విషయానికొస్తే.. బుల్లితెరపై ప్రసారమవుతున్న ఓ షోకు సుడిగాలి సుధీర్, విష్ణుప్రియ జంటగా హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక్కో షోలో ఒక్కో కళాశాలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడంతో కార్యక్రమం ఆద్యాంతం ఎంతో ఎనర్జిటిక్‌గా కొనసాగుతుంది.
పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పిన ''లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కేవేరప్పా'' డైలాగ్ మాదిరి విద్యార్థుల హంగామాకు సుడిగాలి సుధీర్, విష్ణుప్రియల పంచ్ ప్రాసలు తోడైతే ఆ షో హంగామా వీర లెవల్లో ఉంటుంది. వారిద్దరికి తోడు మరో ఇద్దరు కో- యాంకర్ల కామెడీ టైమింగ్ అదుర్స్ అనే చెప్పొచ్చు.
తాజాగా, బుల్లితెరలో ప్రసారమైన ఆ షోలో వారు ఆలోచించి మాట్లాడారా..? లేక ఇంకేమైనానా..? అంటూ కో- యాంకర్లుగా ఉన్న ఆ ఇద్దరి సంభాషణపై నెటిజన్లు ఫైరవుతున్నారు. ఇంతకీ వారేం చేశారన్న విషయానికొస్తే, అమ్మాయిల తరుపున ఉన్న లేడీ కో- యాంకర్ ''అబ్బాయిలు అమ్మాయిలను ముద్దడుగుతారు కరెక్టే.. అదే సమయంలో మూతి కడుక్కుని రావొచ్చు కదా..?'' అలాగే ''హగ్ అడుగుతారు కరెక్టే.. ఆ సమయంలో స్నానం చేసి రావొచ్చు కదా..?'' అంటూ అబ్బాయిలపై ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. ఆ సంభాషణ విన్న యాంకర్ విష్ణుప్రియ వెంటనే కలుగజేసుకుని వారు అవన్నీ చేస్తే నువ్వు ఇచ్చేస్తావా..? అంటూ ఎదురు ప్రశ్నించడంతో ఒక్కసారిగా సైలెంట్ అయిపోతుంది.
ఏదేమైనా, ఇటీవల కాలంలో బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎంటర్టైన్‌మెంట్ షోలలో వల్గారిటీ ఎక్కువైపోతుందన్న విమర్శ సామాజికవేత్తల నుంచి వినవస్తున్న సంగతి తెలిసిందే. కంటెస్టెంట్స్ సైతం సగటు ప్రేక్షకుడు కుటుంబ సభ్యులతో కలిసి చూడలేని ప్రదర్శనలు ఇస్తుండటం గమనార్హం. అందుకే మన పెద్దలంటుంటారు స్వచ్ఛమైన కామెడీ అంటే పాత రోజుల్లోనేనని. అదే నిజం కూడాను. ఇంతకీ ఆ షో పేరు చెప్పలేదు కదూ ''పోవే.. పోరా''