శ్రీ‌రెడ్డి పండ్ల‌తోట‌: ఒక్కో ప్ర‌దేశం.. ఒక్కో పండుతో..!

By Newsmeter.Network  Published on  26 Dec 2019 5:16 AM GMT
శ్రీ‌రెడ్డి పండ్ల‌తోట‌: ఒక్కో ప్ర‌దేశం.. ఒక్కో పండుతో..!

అవును, మీరు చ‌దివింది నిజ‌మే. శ్రీ‌రెడ్డి పండ్లతోట‌లో.. అన్నీ చూడ‌ద‌గిన ప్ర‌దేశాలే. అదేంటి నిత్యం వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌ల‌తో సెన్షేష‌న్ క్రియేట్‌చేసే శ్రీ‌రెడ్డి పండ్లతోట వేయ‌డ‌మేంటి..? అందులో చూడ‌ద‌గిన ప్ర‌దేశాలేంటి..? అన్న డౌట్ మీకు రావొచ్చు. ఇలా ప్ర‌శ్న‌లు సంధించే ముందు ఈ క‌థ‌నాన్ని పూర్తిగా చ‌దివితే మీకూ ఓ క్లారిటీ వ‌చ్చేస్తుంది మ‌రీ..!

నీవెప్పుడూ సోష‌ల్ మీడియాలో పోస్టు చేస్తుంటావు క‌దా..! ఇవి మా ఇంటి గార్డెన్ ప్ర‌దేశంలోని పండ్ల చెట్ల‌కు కాచిన మామిడి, స‌పోట‌, దానిమ్మ‌, ద్రాక్ష ఇలా చాలా పండ్లు పండుతాయ‌ని, వాటి గురించి కాస్త వివ‌రంగా చెప్ప‌వా..? అంటూ త‌న అభిమానులు ఎంతో ప్రేమ‌గా అడిగిన ప్ర‌శ్న‌ల‌కు శ్రీ‌రెడ్డి స్పందించింది.

న‌న్ను నిత్యం అభిమానిస్తూ, స‌పోర్టు చేస్తున్న వారికి నా పండ్ల తోట‌ను ప‌రిచ‌యం చేద్దామ‌ని ఎప్ప‌ట్నుంచో అనుకుంటున్నా. ఇటీవ‌ల కాలంలో బిజీ లైఫ్ కార‌ణంగా అది కుద‌ర‌లేదు. ఏదేమైనా మా ఇంటి గార్డెన్‌లో పండ్ల చెట్ల‌ను స‌ప‌రేట్‌గాను, కూర‌గాయ‌ల చెట్ల‌ను స‌ప‌రేట్‌గాను ఇలా వేర్వేరు ప్ర‌దేశాల్లో పెంచుతానంటూ శ్రీ‌రెడ్డి చెప్పుకొచ్చింది.

నటి శ్రీరెడ్డి మనసులో మాట...

ఇంకా శ్రీ‌రెడ్డి మాట్లాడుతూ.., ఐ ల‌వ్ మై గార్డెన్‌. నా మొక్క‌లు కూడా న‌న్ను ప్రేమిస్తాయి. మొక్క‌ల‌కు బ‌గ్స్ వ‌చ్చిన‌ప్పుడు అవి నావైపు చూస్తూ మ‌మ్మీ ప్లీజ్ డూ స‌మ్‌థింగ్ అంటూ నాతో మాట్లాడుతున్న‌ట్టు అనిపిస్తుంది. అవి న‌వ్వుతున్న‌ప్పుడు నాకు హ్యాప్పీ.. వాటికి బ‌గ్స్ వ‌చ్చిన‌ప్పుడు నాకు దుఃఖం. నా ఒంట‌రి జీవితానికి రిలాక్సేష‌న్ ఏదైనా ఉందంటే అది కేవ‌లం మొక్క‌ల‌ను చూసుకున్న‌ప్పుడే.

క‌ల్ముషం లేని ప్రాణుల్లో మొక్క‌ల‌ది ప్ర‌థ‌మ స్థానం అన్న‌ది నా భావ‌న‌. అదే నిజం కూడా. మొక్క‌లు మ‌నుషుల‌కు ఏ మాత్రం హాని చేయ‌వు. అస‌లు వాటికి ప్రేమించ‌డం త‌ప్ప వేరే ఏదీ తెలియ‌దు. మొక్క‌ల‌కు నీళ్లు పోసిన‌ప్పుడు ఎంతో ఆహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణాన్ని మ‌న‌కు అందిస్తూ అవి కూడా సంతోషంగా గ‌డుపుతాయి. ఒక‌వేళ నీళ్లు పొయ్య‌డం మ‌రిచిపోతే అమాయ‌క‌మైన ముఖంతో మ‌న‌ల్ని చూస్తుంటాయి.

ఒక పంట‌ను సాగుచేసే రైతు వెన‌కాల ఎంత కృషి ఉంటుందో తెలియాలంటే ప్ర‌తి ఒక్క‌రూ గార్డెన్‌ను ఏర్పాటు చేయాలి. పిల్ల‌ల‌కు మొక్క‌ల పెంప‌కం అండ్ కేరింగ్ అన్న‌ది నేర్పిస్తే గ‌నుక అది వారి జీవితాల్లో ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. మొక్క‌ల మాదిరే ఫ్యామిలీ కేరింగ్ అన్న‌ది వారికి తెలుస్తుంది. ఇలా మొక్క‌ల పెంప‌కంతో ఎన్నో మంచి అల‌వాట్లు చిన్నారుల‌కు నేర్పించిన వార‌మ‌వుతామంటూ త‌న‌కు తెలిసిన ఫిలాస‌ఫీని త‌న అభిమానుల‌తో పంచుకుంది శ్రీ‌రెడ్డి.

నిజానికి మా ఇంటి గార్డెన్‌లో పండ్ల చెట్లు, కూర‌గాయ‌ల మొక్క‌ల‌తోపాటు చాలా ప‌క్షులు, ఉడ‌త‌లు వ‌స్తుంటాయి. వాటి రాక‌పోక‌ల‌తో చాలా సంతోషం అనిపిస్తుంది. నేచ‌ర్‌కు చాలా ద‌గ్గ‌ర‌గా ఉన్న‌ట్టు అనిపిస్తుంది. దొండ చెట్టుకు కాచిన కాయ‌లు చాలా బుజ్జి.. బుజ్జిగా ఉంటాయి. ద్రాక్ష చెట్టు ఆకులు ఏనుగు చెవుల వ‌లె పెద్ద పెద్ద‌గా వ‌చ్చాయి.

ఇక బీర‌కాయ‌ల విష‌యానికొస్తే, చాలా చిన్న సైజులో.. చూసేందుకు చాలా క్యూట్‌గా ఉంటాయి. వాటిని ప‌ట్టుకునేందుకు కూడా చాలా భ‌య‌ప‌డుతుంటాను. ఎందుకంటే ఒక‌వేళ వాటిని తాకితే అవి కాపుకు వ‌స్తాయో.. రావోన‌న్న భ‌యం ఉంటుంది. ఇలా త‌న ఇంటి గార్డెన్‌లోని పండ్ల తోట‌, కూర‌గాయ‌ల తోటల‌ను శ్రీ‌రెడ్డి త‌న అభిమానుల‌కు ప‌రిచ‌యం చేసింది. ఏదేమైనా మొన్న‌టి వ‌ర‌కు వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా ఉన్న శ్రీ‌రెడ్డి ఇటీవ‌ల గుళ్లు.. గోపురాలు.. చెట్లు అని ప‌ల‌క‌డం చూసి ఆమె అభిమానులు ఉబ్బిత‌బ్బుబ్బైపోతున్నారు.

Next Story