బిగ్‌బాస్ హౌజ్‌కు రావడానికి అనసూయ ఒప్పుకుందా..?
By తోట వంశీ కుమార్ Published on 15 May 2020 11:09 AM IST'బిగ్‌బాస్'.. ఇప్పుడు తెలుగు నాట యమ క్రేజ్ ఉన్న షో. ఇప్పటికే మూడు సీజన్లు కంప్లీట్ చేసుకుంది. లాక్‌డౌన్ తరువాత నాలుగో సీజన్ ప్రారంభం కానుంది. ఇందుకోసం బిగ్‌బిస్ టీమ్ ఇప్పటికే కంటెస్టెంట్ల కోసం వేట మొదలు పెట్టిందట. ఈ క్రమంలో పలువురితో సంప్రదింపులు జరిపిందని తెలుస్తోంది.
అందం, అభినయం అనసూయ సొంతం. యాంకర్ గానే కాకుంగా నటిగా మంచి గర్తింపు తెచ్చుకుంది. బిగ్‌బిస్ మొదటి సీజన్ నుంచి ఆమె బిగ్‌బాస్ కంటెస్టెంట్ గా రానుందనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా నాలుగో సీజన్ కోసం నిర్వాహకులు ఆమెను సంప్రదించారట.
బిగ్‌బాస్ సీజన్ 3 కోసం యాంకర్ శ్రీముఖికి భారీ పారితోషికం ఇచ్చారట. ఆమెకు ఒక్కో ఎపిసోడ్‌కు లక్ష రూపాయల వరకు ఇచ్చినట్లు టాక్ వచ్చింది. ఈ లెక్కన అనసూయను హౌజ్ లోకి తీసుకువచ్చేందుకు చాలా పెద్ద మొత్తాన్నే ఆఫర్ చేశారట. అయినా ఫలితం దక్కలేదని తెలుస్తోంది. ఈ ఆఫర్ ను అనసూయ సున్నితంగా తిరస్కరించిందని చెబుతున్నారు. తనకు ఏ మాత్రం ఇంట్రెస్ట్ లేదని, ఫ్యామిలీకి తాను అన్ని రోజులు దూరంగా ఉండలేనని చెప్పిందట. ప్రస్తుతం అనసూయ పుల్ బిబీగా ఉంది. యాంకరింగ్‌తో పాటు సినిమాల్లో నటిస్తుంది. ఇటీవలే ఓ బాలీవుడ్ సీరియల్‌లో నటించేందుకు అవకాశం వచ్చిందనే వార్తలు వినిపించాయి. ఈ కారణంతోనే బిగ్‌బాస్‌కు నో చెప్పారని అనుకుంటున్నారు.
బిగ్‌బాస్ మొదటి సీజన్‌కు ఎన్టీఆర్, రెండవ సీజన్‌కు నాని, మూడవ సీజన్‌కు నాగార్జున హోస్టులు వ్యవహరించారు. మరీ నాలుగో సీజన్ కు హోస్టుగా ఎవరు చేయనున్నారని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.