స్టార్ క‌మెడియ‌న్‌కు వార్నింగ్ ఇచ్చా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 May 2020 7:52 AM GMT
స్టార్ క‌మెడియ‌న్‌కు వార్నింగ్ ఇచ్చా

టాలీవుడ్‌లో హీరోయిన్ల‌కు పుల్ ఫాలోయింగ్ ఉంటుంది. మ‌రీ క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుల‌కు ఫ్యాన్స్ చాలా త‌క్కువ‌. కానీ హీరోయిన్ స్థాయిలో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టు ప్ర‌గ‌తికి ఫాలోయింగ్ ఉంది. ప్ర‌గ‌తిని చూడ‌గానే ఎవ‌రైనా స‌రే.. కొన్ని నిమిషాల పాటు చూస్తూ ఉంటారు. తెలుగులో చాలా చిత్రాల్లో త‌ల్లిగా, అక్క‌గా న‌టించి మెప్పించింది. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో షాకింగ్ విష‌యాలు వెల్ల‌డించింది.

ఓ సినిమా షూటింగ్ స‌మ‌యంలో ఒక‌ సీనియ‌ర్ మోస్ట్ క‌మెడియ‌న్ త‌న‌తో త‌ప్పుగా ప్ర‌వ‌ర్తించాడ‌ని చెప్పింది. ఆ స్టార్ క‌మెడియ‌న్ పేరు అయితే చెప్ప‌లేదు గానీ.. ఆ స‌మ‌యంలో ఆయ‌న చాలా బిజీగా ఉన్నాడ‌ని మాత్రం చెప్పుకొచ్చింది. ఒక సినిమాలో నటిస్తున్న సమయంలో ఆ కమెడియన్ నాతో పదే పదే మాట్లాడేందుకు ప్రయత్నించడంతో పాటు టచ్ చేసేందుకు ప్రయత్నించాడు. అతడి మాటలు చేష్టలు నాకు చాలా ఇబ్బందిని కలిగించాయి. విషయం చాలా దూరం వెళ్లకుండా వెంటనే నేను అతడితో మాట్లాడాను.

ఇక ఓ రోజు షూటింగ్‌కి ప్యాక‌ప్ చెప్ప‌గానే త‌న‌ని కారావ్యాన్ లోకి తీసుకెళ్లాను. మీ చేష్ట‌ల వ‌ల్ల చాలా ఇబ్బందిగా ఉంది. మీ ప్ర‌వ‌ర్త‌న ఏ మాత్రం బాగాలేదు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌ని.. మార్చుకోవాల‌ని ఆయ‌నకి వార్నింగ్ ఇచ్చా. దీంతో అత‌ను సైలెంట్‌గా అక్క‌డి నుంచి వెళ్లిపోయాడు. ఆ త‌రువాత నాతో ఎప్పుడూ మ‌ళ్లీ త‌ప్పుగా ప్ర‌వ‌ర్తించ‌లేదని చెప్పింది ప్ర‌గ‌తి.

Next Story